విమాన ప్రయాణానికి ధీటుగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇందుకోసం కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ హై స్పీడ్ రైళ్లు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో.. చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో ప్రయాణీకులను చేరవేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు మరియు చెన్నైకి విమానాలు వరుసగా 1 గంట 15 నిమిషాలు మరియు 1 గంట 20 నిమిషాలు చేరుకోవడానికి పడుతుంది. ఇక ఎయిర్‌పోర్టుల నుంచి ఇళ్లకు చేరేందుకు మొత్తంగా 2-3 గంటల సమయం పడుతుంది. ఇదే సమయంలో హైస్పీడ్ రైళ్లు తీసుకొస్తే ఎలా ఉంటుందని కేంద్రం యోచిస్తోంది.
ఇది కూడా చదవండి: Laila : ‘లైలా’ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్.. నా కెరీర్ లో మెమరబుల్ మూవీ : విశ్వక్సేన్
రెండు హైస్పీడ్ రైళ్ల కోసం కారిడార్లను అభివృద్ధి చేయాలని కేంద్రం ప్రణాళిక రచిస్తోంది. దాదాపు 10 గంటల సమయం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైళ్లు గంటకు 320 కి.మీ వేగంతో నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. విమాన ప్రయాణానికి పోటీగా ఈ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోందని జాతీయ మీడియా ఒక కథనంలో పేర్కొంది. ఇందుకోసం హైదరాబాద్-చెన్నై కారిడార్ 705 కి.మీ. విస్తరించాలని ప్రతిపాదించగా.. హైదరాబాద్-బెంగళూరు మార్గం 626 కి.మీ. ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థ మరియు ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ అయిన ఆర్‌ఐటీఈఎస్ లిమిటెడ్‌ను సర్వే కోసం టెండర్లను ఆహ్వానించింది. సర్వే మరియు అంచనాకు రూ.33 కోట్లు ఖర్చవుతుందని సమాచారం.
ఇది కూడా చదవండి: Badmashulu Teasir: బద్మాషులు టీజర్.. వీళ్ళు నిజంగానే బద్మాషుల్లాగా ఉన్నారే
వందే భారత్ వంటి సరుకు రవాణా రైళ్లు, ప్రయాణీకులకు సేవలు అందించే సాంప్రదాయ రైలు పట్టాల మాదిరిగా కాకుండా… ఈ కొత్త కారిడార్లు ప్రత్యేకంగా హై-స్పీడ్ రైళ్ల కోసం నిర్మించనున్నారు. ఈ డిజైన్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్ మాదిరిగా ఉంటుంది. బుల్లెట్ రైలు నడిచే విధంగా పట్టాలు ఏర్పాటు చేయనున్నారు. ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్ట్ 2015 లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ కారిడార్లు తుది రూపం దాల్చడానికి దాదాపు 15 సంవత్సరాలు పట్టవచ్చని దక్షిణ మధ్య రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kamal Haasan: కమల్ హాసన్‌కు ప్రమోషన్.. త్వరలో రాజ్యసభలోకి ఎంట్రీ!