Supreme Court: “ఆస్తి వివాదాల”పై హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన..
- ఆస్తి వివాదాలపై మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు..
- ముఖ్యంగా హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సూచన..
- మహిళల ఆస్తిపై అత్తింటి వారు, తల్లిదండ్రులకు మధ్య వివాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు, తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి అంటూ కీలక సూచనను సుప్రీం కోర్ట్ చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఈ సూచనల్ని చేసింది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15 ప్రకారం ఆస్తి పంపకం విషయంలో జరిగే కుటుంబ వివాదాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఈ తీర్పుఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న Hindu Succession Act, 1956 – Section 15(1)(b) ప్రకారం, ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోతే, ఆమె భర్త , కుమారుడు, కుమార్తె ఎవరూ లేకపోతే… ఆమె ఆస్తి తల్లిదండ్రుల కు వెళ్తుంది. ఈ చట్టం విషయంలో మహిళల తల్లిదండ్రుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో వివాదాల కారణంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
Read Also: Maoists killed: మూడు రోజులుగా కూంబింగ్.. ఏడుగురు మావోయిస్టులు మృతి!
Also Read
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
1956లో చట్టం రూపొందించినప్పుడు మహిళలు పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదిస్తారని ప్రభుత్వం ఊహించలేదని.. కానీ ఇప్పుడు విద్య, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ముందుకు వెళ్తున్న మహిళలు గణనీయంగా స్వంత ఆస్తులు సంపాదిస్తున్నారని, అలాంటి ఆస్తుల విషయంలో వారు వీలునామా రాకుండా చనిపోతే, ఆస్తి భర్త వైపు బంధువులకే వెళ్లడం తల్లిదండ్రులకు బాధ కలిగించే అంశమని కోర్టు గమనించింది. అయితే కోర్టు సెక్షన్ 15(1)(b) చెల్లుబాటుపై తీర్పు ఇవ్వలేదు. సరైన పక్షాలు సరైన సందర్భంలో ఈ అంశాన్ని సవాల్ చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల హక్కులపై వివాదం వస్తే – ముందుగా ‘మధ్యవర్తిత్వం’ తప్పనిసరి అని కోర్ట్ స్పష్టం చేసింది.
ఒక హిందూ మహిళ వీలునామా లేకుండా చనిపోయి, ఆమె తల్లిదండ్రులు లేదా వారి వారసులు ఆస్తిపై హక్కు కోరితే, ప్రీ-లిటిగేషన్ మధ్యవర్తిత్వం తప్పనిసరి తెలిపింది. వివాదాల మధ్యవర్తిత్వం రాష్ట్ర, జిల్లా, తాలూకా స్థాయి లీగల్ సర్వీసెస్ అథారిటీలు నిర్వహించాలని, ఈ విధానం వల్ల కోర్టులకు వెళ్లే కేసుల సంఖ్య తగ్గించడమే కాకుండా, కుటుంబాల మధ్య గొడవలు పెరగకుండా చూడొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..