Supreme Court: తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు, తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి అంటూ కీలక సూచనను సుప్రీం కోర్ట్ చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సూచనల్ని చేసింది.
Supreme Court: విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఎటువంటి ఫిర్యాదు లేకున్నా సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో అలసత్వం వహిస్తే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడుతామని హెచ్చరించింది. ప్రసంగం చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోబడతాయని, దీని ద్వారా భారత రాజ్యాంగంలోని మౌళిక లక్షణం అయిన లౌకికవాదాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. కేంద్ర ప్రభుత్వానికి న్యాయమూర్తుకు సంబంధించిన సిఫార్సులు చేసింది.. 9 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొలీజియం.. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్…