Supreme Court: తమ తదనంతరం ఆస్తిని ఎవరికి పంచాలనే దానిపై హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలనీ సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. దేశంలోని మహిళలందరికీ, ముఖ్యంగా హిందూ మహిళలకు, తమ ఆస్తి వారసత్వంపై భవిష్యత్ వివాదాలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా వీలునామా రాసుకోవాలి అంటూ కీలక సూచనను సుప్రీం కోర్ట్ చేసింది. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ సూచనల్ని చేసింది.
తాజాగా సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. పిల్లలు లేని హిందూ వితంతవు మరణిస్తే.. ఆమె ఆస్తి తన భర్త కుటుంబంలోని వారసులకు వెళుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సంతానం లేని హిందూ వితంతువు వీలునామా లేకుండా మరణిస్తే ఆమె ఆస్తిని ఎవరు వారసత్వంగా పొందుతారు అనేది అనేక పిటిషన్ల ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.. COVID-19 కారణంగా ఒక యువ జంట మరణించిన కేసు సుప్రీం…
భర్త మరణానంతరం మరో వివాహం చేసుకున్న భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం భర్త ఆస్తిలో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. తమిళనాడులోని సేలంకు చెందిన చిన్నయ్యన్ అనే వ్యక్తి మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకున్నారు.