పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈవై ఉద్యోగిని అధిక పని కారణంగా తనువు చాలించింది. ఈ ఘటన యావత్తు భారతీయల హృదయాలను కలిచి వేసింది. కనీసం ఆమె అంత్యక్రియలకు ఒక్క ఎంప్లాయి కూడా హాజరు కాలేదు. ఈ అంశం మరింత దిగ్భ్రాంతి కలిగించింది.