Gujarat and Himachal Pradesh election results today: దేశవ్యాప్తంగా ఉత్కంఠతకు నేడు తెరపడనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలతో పాటు అన్ని పార్టీలకు, దేశప్రజలకు ఆసక్తి నెలకొంది. ఢిల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాష్ట్రాలపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే వరస పరాజయాలతో ఢీలా పడిన కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం ఎదురుచూస్తోంది. ఇదిలా ఉంటే ఈ రెండు రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీనే గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి.
Read Also: Rajasthan: రాజస్థాన్ మంత్రి బూతుపురాణం.. మహిళతో అసభ్యకరమైన వీడియో
2014 నుంచి వరసగా పరాజయాలు పాలవుతున్న కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ కంచుకోటలను బద్ధలు కొట్టాలనుకుంటోంది ఆప్. గుజరాత్ అసెంబ్లీలో 182 స్థానాల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని.. ఆ పార్టీకి గత ఎన్నికలతో పోలిస్తే అధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 68 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య నెక్ టూ నెక్ ఫైట్ ఉంటుందని అంచనా వేస్తున్నాయి పలు సర్వే సంస్థలు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో గెలుపు బీజేపీకి చాలా కీలకం. గత 27 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే ఈ రాష్ట్రంలో వరసగా ఏ పార్టీ కూడా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే ఈ సారి బీజేపీ ఆ సంప్రదాయానికి తెరదించాలని చూస్తోంది.