Video: రాజస్థాన్‌లో గూడ్స్ రైలు బొలెరో ఎస్‌యూవీని ఢీకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ జవాన్ తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్‌లో, సెక్యూరిటీ లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం దారుణంగా దెబ్బతింది. వాహనం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
Read Also: MI vs CSK : ముంబై ఇండియన్స్ టీంలో కీలక బౌలర్ దూరం.. మూల్యం తప్పదా?
వైరల్ అవుతున్న వీడియోలో, వాహనం రైల్వే ట్రాక్‌పై వెళ్లిన వెంటనే, రైలు వస్తున్న విషయాన్ని గమనించిన ఒక వ్యక్తి, వాహనం నుంచి వెంటనే బయటకు వచ్చాడు. ఆ తర్వాత రైలు, వాహనాన్ని ఢీకొడుతున్నట్లు కనిపిస్తుంది. ప్రమాదం వివరాలు తెలుసుకున్న సీనియర్ సీఐఎస్ఎఫ్ సిబ్బంది, ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు, బొగ్గుతో నిండిన రైలు థర్మల్ ప్రాజెక్ట్ వైపుగా వెళ్తోంది. రైలు వేగం తక్కువగా ఉండటం, డ్రైవర్ బ్రేక్ వేయడం వల్ల ఇంజన్ ఆడిపోయింది. సంఘటన జరిగిన సమయంలో SUVలో ఒక CISF సబ్-ఇన్‌స్పెక్టర్, భద్రతా సిబ్బంది, డ్రైవర్ ఉన్నట్లు తెలుస్తోంది. పట్టాలపై ఇరుక్కుపోయిన బొలెరోని క్రేన్ సహాయంతో తొలగించారు.
Suratgarh Thermal Power Plant #Rajasthan.
Bolera carrying CISF troops, trying to cross Railway crossing hit by Goods train.
Thankyou God to Goods train Pilot that he puts in an emergency brake and luckly all survived.#IndianRailways #Accident #DishaPatani #CSKvsMI #csktickets pic.twitter.com/ImOpUPxxFz— देशहित सर्वोपरि (@Mindblower81) March 23, 2025