Video: రాజస్థాన్‌లో గూడ్స్ రైలు బొలెరో ఎస్‌యూవీని ఢీకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్ జవాన్ తృటిలో ప్రాణాలు దక్కించుకున్నాడు. శుక్రవారం రాజస్థాన్‌లో, సెక్యూరిటీ లేని రైల్వే క్రాసింగ్ దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సూరత్‌గఢ్ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనం దారుణంగా దెబ్బతింది. వాహనం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.