Bengaluru: బెంగళూర్ నగరంలో వీసా గడువు ముగిసినప్పటికీ 600 మందికి పైగా విదేశీయులు తిష్ట వేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరందరినీ వారి దేశాలకు వాపసు పంపేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన యువతిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు వివాహమాడి బెంగళూరులో కాపురం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చాక నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పాక్ యువతిని స్వదేశానికి తిప్పి పంపిన తరహాలోనే నగరంలో తిష్టవేసిన ఆఫ్రికా దేశాలకు చెందిన వారిని…