పార్లమెంట్‌లో మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం, పెంచడం వంటి చర్యలతో రిటైల్ మార్కెట్‌లో ఆయా వస్తువుల ధరలపై ప్రభావం చూపించనుంది. తాజా బడ్జెట్‌తో ఏవి పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయో చూద్దాం.
ధరలు తగ్గే వస్తువులు ఇవే..!
. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, మొబైల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు
. ఎలక్ట్రిక్ వాహనాలు
. కేన్సర్ మందులు
. బంగారం, వెండి
. లిథియం బ్యాటరీలు
. సైకిల్స్
. ఆర్టిఫిషియల్స్ వజ్రాలు
. బొమ్మలు
. రొయ్యలు, చేపల మేతపై 5 శాతం సుంకం తగ్గింపు
. సోలార్ ఎనర్జీ భాగాలు
. లెదర్, ఫుట్‌వేర్, ఫెర్రోనికెల్, బ్లిస్టర్ కాపర్ మినరల్స్
ధరలు పెరిగేవి ఇవే..!
. ప్లాటినం వస్తువులు
. కాంపౌండ్ రబ్బర్
. కాపర్ స్క్రాప్
. సిగరెట్
. టెలికాం పరికరాలు
. అమ్మోనియం నైట్రేట్, నాన్ బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్