పార్లమెంట్‌లో మంగళవారం సంకీర్ణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రుచించలేదు. వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూసింది. శుక్రవారం భారీగా పతనమైన సూచీలు.. బడ్జెట్ ముందు పుంజుకుంటుందని భావించారు.
పార్లమెంట్‌లో మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని తగ్గించడం, పెంచడం వంటి చర్యలతో రిటైల్ మార్కెట్‌లో ఆయా వస్తువుల ధరలపై ప్రభావం చూపించనుంది. తాజా బడ్జెట్‌తో ఏవి పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయో చూద్దాం.