నిజాతీగా ఒక్కడు ఉంటే చాలు సమాజం బాగుపడుతుంది. ఇది ఓ సినిమా డైలాగ్. కానీ.. ఇలాంటి వారిని నిజ జీవితంలో మనం చూడం కూడా మహా అరుదు. అలాంటి వారు నిజంగా వుంటే ఎలా వుంటుందో ఓ ప్రయాణికుడు నిరూపించాడు.
మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినా.. లేదంటే ఏదైనా ఓ పెద్ద హోటల్ కి వెళ్ళినా టిప్ గా రూ.50, లేదా 100 ఇస్తూ వుంటాం. అది పెద్దగా మనకు వేస్ట్ గా ఇస్తున్నట్లు అనిపించదు. అతను మంచి సర్వ్ చేశాడనే ఆనందంతో మనం అతనికి టిప్ ఇస్తాం. కానీ ఒకతను రైల్వేతో ఏకాంగా ఐదేళ్లు పోరాడి తనకు రావాల్సిన రూ. 35 సాధించుకున్నాడు. ఆయన పోరాటం అక్కడికే పరిమితం కాలేదు. ఆయన పోరాటంతో.. ఏకంగా 2.98 లక్షల మందికి లబ్ధి చేకూర్చాడు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన సుజీత్‌స్వామి అనే ఇంజినీర్ 2 జులై 2017న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఐఆర్‌సీటీసీ ద్వారా ఏప్రిల్‌లో టికెట్ బుక్ చేసుకుని టికెట్ ధర రూ. 765 చెల్లించారు. ఆ తర్వాత ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో రూ. 100 మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ఐఆర్‌సీటీసీ రిఫండ్ చేసింది.
నిజానికి కేన్సిలేషన్ రుసుము రూ. 65 మాత్రమే మినహాయించుకోవాల్సి ఉండగా అదనంగా రూ. 35 జీఎస్టీ కింద వసూలు చేయడంపై స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జీఎస్టీ అమల్లోకి రాకముందే టికెట్ బుక్ చేసుకున్నానని, అలాంటప్పుడు తన నుంచి జీఎస్టీ ఎలా వసూలు చేస్తారని రైల్వేపై పోరాటానికి దిగారు. ఇందులో భాగంగా రైల్వేకు, ఐఆర్‌సీటీసీకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద 50 అర్జీలు పెట్టారు. ఫలితంగా దిగొచ్చిన రైల్వే.. జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ. 35ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.
రూ. 35 చెల్లించాల్సిన రైల్వే 1 మే 2019న ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 33 మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించారు. ఆ రెండు రూపాయలను కూడా రైల్వే ఆయన ఖాతాలో జమచేసింది. అంతేకాదు, ఆయన పోరాటంతో మరో 2.98 లక్షల మంది కూడా లబ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్లు బుక్ చేసుకుని కేన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం మొత్తంగా రూ. 2.43 కోట్లను రైల్వే రీఫండ్ చేయనుంది.
అతను ఇలా పోరాటం చేయడంతో.. 2.98 లక్షల మందికి లబ్దికి చేరుకుంది. దీంతో స్వామి చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కేవలం రూ.35 లేగా అంటూ నవ్వుకున్న వారికి షాక్ ఇచ్చావు. ఏ ఒక్కరూపాయైనా సంపాదించందే దాని విలువ తెలియదు. ఒక్కొక్క రూపాయి విలువ తెలుసు కాబట్టే తాను పోరాటం చేయడమే కాకుండా మిగతా 2.98 లక్షల మందికి కూడా న్యాయం చేయడం పై ప్రశంస జల్లు కురిపిస్తున్నారు. స్వామి చేసిన పనికి అధికారులు అవాక్కయ్యారు. చివరకు దిగివచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.35 లు పంపించారు. ఏదైమైనా రైల్వే అధికారులకు మాత్రం స్వామి చేసిన పోరాటంతో దిమ్మతిరినట్టైంది.
TDP : ఆ మాజీమంత్రి మహానాడుకు వెళ్తే ఆదరించరని సందేహం కలిగిందా..?