TDP : ఆ మాజీమంత్రి మహానాడుకు వెళ్తే ఆదరించరని సందేహం కలిగిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీకి మహానాడు కీలకం. ఆ వేడుక ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు పార్టీ నాయకులు… కార్యకర్తలు. అంతటి కీలకమైన కార్యక్రమానికి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డుమ్మా కొట్టేశారు. టీడీపీ హైకమాండ్‌తో గంటాకు సఖ్యత లేదన్నది ఇటీవల చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు బహిర్గతమైంది. చంద్రబాబును ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తే ముఖస్తుతి పలకరింపులే దక్కాయట. దాంతో పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షకు హాజరుకాలేదు గంటా. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉండటంతో యాక్టివ్ పాలిటిక్స్ ఉండేందుకు పావులు కదుపుతున్నారు మాజీ మంత్రి. టీడీపీ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తరచూ టీడీపీ ఆఫీసుకు వెళ్తున్నారు. ఈక్రమంలోనే మహానాడుకు కూడా గంటా హాజరవుతారని భావించారు పార్టీ నేతలు. పైగా రాష్ట్ర భవిష్యత్ బాగుపడాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమని.. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమైని కీలక వ్యాఖ్యలు చేశారు గంటా.
మహానాడు అట్టహాసంగా జరిగింది. కానీ.. అందులో గంటా శ్రీనివాసరావు కనిపించలేదు. మహానాడుకు గంటా వెళ్లకపోవడంపై మళ్లీ కథ మొదటికి వచ్చిందనే కామెంట్స్ జోరందుకున్నాయి. మాజీ మంత్రి ఎందుకు వెళ్లలేదు అనే ఆరాలు మొదలయ్యాయి. వ్యక్తిగత కారణాలతోనే గంటా మహానాడుకు వెళ్లలేదని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే పార్టీలో మరో చర్చా జరుగుతోందట. మహానాడుకు టీడీపీ ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు వెళ్లాయి. వారి హోదాలు ఆధారంగా గ్యాలరీలను కేటాయించారు. వేదికపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు జరిగాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు A గ్యాలరీని కేటాయించారు. ఎమ్మెల్యే హోదాలోనే గంటాను ఆహ్వానించారట. మినహాయింపులు ఇస్తే గంటాను వ్యతిరేకిస్తున్న టీడీపీలోని సీనియర్లతో ఇబ్బందులు వస్తాయని హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకుందట. ఈ చర్యను అవమానంగా భావించే మాజీ మంత్రి మహానాడుకు వెళ్లలేదని చర్చ జరుగుతోంది.
Also Read
అయితే మహానాడులో ముందు అనుకున్న నిబంధనలేవీ అమలు కాలేదు. జిల్లా స్థాయి టీడీపీ నాయకులు సైతం వేదికపై కనిపించారు. అలాగే నలుగురితో వెళ్లడం కంటే.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోరుకుంటారు గంటా. అయితే మాజీ మంత్రికి ప్రాధాన్యం ఇవ్వొద్దని టీడీపీలోని బలమైనవర్గం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తోందట. మరో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో గంటాకు రాజకీయ వైరం ఉంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడితోనూ సన్నిహిత సంబంధాలు లేవన్నట్టు వినికిడి. ఈ మూడేళ్ల కాలంలో గంటా పార్టీ మారిపోతారని రకరకాలుగా ప్రచారం జరిగింది. అలాగే టీడీపీ హైకమాండ్ నిర్ణయాలతో సంబంధం లేకుండా వ్యవహరించడం కూడా ప్రతికూలంగా మారిందని టాక్. ప్రస్తుతానికి టీడీపీలోనే ఉండాలని నిశ్చయించుకున్నప్పటికీ పార్టీ అధిష్ఠానంతో ఉన్న గ్యాప్‌ను తగ్గించుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు గంటా. చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. స్థానిక నాయకత్వం అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. మరి.. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
IND vs WI: రుతురాజ్, నితీష్ ఇన్.. ఆ ఇద్దరు స్టార్లకు నో ఛాన్స్.. వెస్టిండీస్‌తో తొలి వన్డేకు భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!