JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JNU Protest: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) మరోసారి వివాదంలోకి వచ్చింది. సోమవారం యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉమర్ ఖాలిద్ రచించిన ‘Fractured Communities’ పుస్తకంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా JNU విద్యార్థి సంఘం (JNUSU) నేతలు ఉమర్ ఖాలిద్ విడుదలను డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. SSS-2 భవనం బయట నిర్వహించిన కార్యక్రమంలో ‘ఉమర్ ఖాలిద్‌ను విడుదల చేయాలి’, ‘జైలు తాళాలు బద్దలవుతాయి.. సహచరులంతా విడుదలవుతారు’ వంటి నినాదాలు చేశారు. దీనికి వ్యతిరేకించిన ABVP మద్దతుదారులు కూడా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పుస్తకంపై చర్చ కోసం ఆడిటోరియంను ముందుగా బుక్ చేసుకున్నప్పటికీ, JNU పరిపాలన చివరి నిమిషంలో అనుమతిని రద్దు చేసింది. అయినప్పటికీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించిన విద్యార్థి సంఘం.. SSS-2 భవనం బయట చర్చను కొనసాగించింది. వందలాది మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారని JNUSU తెలిపింది. కార్యక్రమాన్ని ABVP మద్దతుదారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారని JNUSU ఆరోపించింది. స్పీకర్ నుంచి మైక్రోఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించడంతో పాటు ప్యానెలిస్టులతో దురుసుగా ప్రవర్తించారని విద్యార్థి సంఘం నాయకులు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలపై ABVP లేదా JNU పరిపాలన యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ ఘటన అనంతరం JNUSU ఓ ప్రకటన విడుదల చేసింది. యూనివర్సిటీలో చర్చ, వాదన, భిన్నాభిప్రాయాలకు ఉన్న స్థలాన్ని పరిరక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఉమర్ ఖాలిద్‌తో పాటు తాము ‘రాజకీయ ఖైదీలు’గా భావించే వారికి మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. ABVPపై ద్వేషం, హింసను ప్రోత్సహిస్తూ విద్యా చర్చలను అడ్డుకుంటోందని ఆరోపించింది. ఉమర్ ఖాలిద్ అంశంపై JNUలో మరోసారి నినాదాలు, నిరసనలు చోటుచేసుకోవడంతో క్యాంపస్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Also Read
- UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
- Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
- Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
- Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
-
Supreme Court: ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. తదుపరి విచారణ వాయిదా..
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!