Congress: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఇవాళ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేకు రాసిన లేఖలో చవాన్ తాను పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అశోక్ చవాన్ భారతీయ జనతా పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. అశోక్ చవాన్ నాందేడ్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాసేపట్లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్ కాబోతున్నారు.
Read Also: Farmers Protest: రైతుల ఆందోళన.. ఢిల్లీలో మార్చి 12 వరకు 144 సెక్షన్!
ఇప్పటికే, లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెప్తున్నారు. బాబా సిద్దిఖీ, మిలింద్ దేవరా ఇప్పటికే హస్తం పార్టీకి వరుసగా రాజీనామా చేశారు. బాబా సిద్దిఖీ అజిత్ పవార్ అధ్వర్యంలోని ఎన్సీపీలో చేరారు. మిలింద్ దేవరా ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు అశోక్ చవాన్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఒక్కో నేత దూరం అవుతుండటంతో హస్తం పార్టీ డీలా పడుతుంది.