క్షణికావేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదాన్ని నింపింది. అప్పటి దాకా కలిసి మెలిసి తిరిగిన సహచర విద్యార్థిని విగతజీవిగా మారిపోవడంతో ఆ యువతుల గుండెలు తట్టుకోలేకపోయాయి. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోయాయన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. థర్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు.. కుమారుడు శవమై కనిపించాడు.
యూపీ రాజధాని లక్నోలోని లోహియా లా యూనివర్సిటీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని చూసిన తోటి విద్యార్థులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ.. అక్కడికి తీసుకెళ్లగానే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. మృతురాలి తండ్రి ఒక ఐపీఎస్ అధికారి. అతను ఎన్ఐఏ (NIA)లో విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎస్ కుమార్తె మరణ వార్తతో పోలీసు శాఖలో కలకలం రేగింది.
కరీంనగర్ లోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నగునూరులో సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో డిగ్రీ ఫస్ట్ ఈయర్ చదువుతున్న 19 ఏళ్ల సృజన సూసైడ్ చేసుకుంది. ఎవరు లేని సమయంలో హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని సృజన స్వస్థలం.. మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంగా గుర్తించారు.