Kannada Industry : కమల్ హాసన్ తీవ్ర చిక్కుల్లో పడ్డారు. థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. ఇప్పటికే కన్నడ సంఘాలు కమల్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమల్ వ్యాఖ్యలను ఖండించింది. కమల్ హాసన్ క్షమాపణ చెప్పకపోతే థగ్ లైఫ్ సినిమాను కన్నడలో అడ్డుకుంటామని తేల్చి చెప్పింది. కమల్ హాసన్ అయినంత మాత్రాన తమకు సానుభూతి చెప్పింది. కమల్ హాసన్ మే 30లోపు క్షమాపణలు చెప్పకపోతే కన్నడ సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
Read Also : Kamal Haasan : కన్నడ భాషపై వ్యాఖ్యలు.. కమల్ హాసన్ పై కేసు
కర్ణాటక కేఎఫ్‌సీసీ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ.. కమల్ హాసన్ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి. వాటిపై ఇప్పటికే మేం అంతా కలిసి చర్చించాం. ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి తప్పు చేశారు. కచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేదంటే ఆయన థగ్ లైఫ్ సినిమాను అడ్డుకుంటాం. ఇందులో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు. మేం అంతా కమల్ హాసన్ గారితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు. ఇక కేఎఫ్ సీసీ మాజీ అధ్యక్షుడు గోవిందు మాట్లాడుతూ.. కమల్ హాసన్ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. కచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
Read Also : Yamudu: ఆసక్తి రేపుతున్న ‘యముడు’ టీజర్..