Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి చుక్కెదురైంది. ఆయన కస్టడీని పొడగించాలని ఈడీ కోరుతుండటంతో రౌస్ ఎవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది. ఈడీ మరో 7 రోజులు ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు మరో 4 రోజులు కస్టడీని పొడగించింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ప్రశ్నిస్తోంది. ఈ రోజు సాయంత్రం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటికే 9 సార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ, వేటికి కూడా కేజ్రీవాల్ హాజరుకాలేదు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తుందని ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆయను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.
Hemant Soren: భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌ని శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈ కేసులో కేసులో హేమంత్ సోరెన్‌ను ఏడు గంటలకు పైగా విచారించిన తర్వాత బుధవారం ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, దీనిపై ఆయన ఏక కాలంలో జార్ఖండ్ హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించారు.