Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
- రాకీ ఫ్లింటాఫ్ సునామీ
- 76 బంతుల్లో 123 పరుగులు
- తండ్రి రికార్డులే టార్గెట్
- రాకీ ఫ్లింటాఫ్‌పై భారీ అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rocky Flintoff 65 Ball Century: ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ మరోసారి సత్తా చాటాడు. 18 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 2026 వన్డే కప్‌లో లాంకషైర్ తరఫున బరిలోకి దిగిన రాకీ.. సోమర్సెట్పై 65 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మ్యాచ్‌లో మొత్తంగా 76 బంతుల్లో 123 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. రాకీ ఫ్లింటాఫ్ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాకీ ఫ్లింటాఫ్‌తో పాటు కీటన్ జెన్నింగ్స్ కూడా సెంచరీతో చెలరేగాడు. జెన్నింగ్స్ 127 బంతుల్లో 156 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి శతకాలతో లాంకషైర్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 443 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం సోమర్సెట్ను 174 పరుగుల తేడాతో లాంకషైర్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో రాకీ బ్యాటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాకీ ఇప్పటికే తన తండ్రి పేరుతో ఉన్న రికార్డులను అధిగమిస్తూ దూసుకెళుతున్నాడు. ఇప్పటివరకు ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 14 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. 2025లో ఇంగ్లండ్ లయన్స్ తరఫున క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై చారిత్రాత్మక సెంచరీ బాదాడు. అప్పటికి అతడి వయసు కేవలం 16 ఏళ్ల 291 రోజులు మాత్రమే. దీంతో ఇంగ్లండ్ లయన్స్ తరఫున తొలి సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.
Also Read
- Gautam Gambhir: "ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?".. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
- Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
ఈ క్రమంలోనే రాకీ తన తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్ రికార్డును కూడా అధిగమించాడు. ఆండ్రూ ఇంగ్లండ్ లయన్స్ తరఫున తన తొలి సెంచరీని 20 ఏళ్ల 28 రోజుల వయసులో చేశాడు. రాకీ కేవలం 16 ఏళ్ల వయసులోనే ఆ ఘనత అందుకోవడంతో.. చిన్న వయసులోనే లయన్స్ తరఫున సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఆండ్రూ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్ బాష్‌లో సిడ్నీ థండర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో లయన్స్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. దాదాపు 23 నెలల పాటు లయన్స్‌కు కోచ్‌గా వ్యవహరించిన ఫ్లింటాఫ్.. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు.
2024లో టాప్ గేర్ కార్యక్రమం చిత్రీకరణ సమయంలో జరిగిన కారు ప్రమాదం తర్వాత ఫ్లింటాఫ్ మళ్లీ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అనంతరం ఇంగ్లండ్ లయన్స్‌తో పాటు ఇంగ్లండ్ సీనియర్ వైట్-బాల్ జట్టుతో కూడా పనిచేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు. అలాగే ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు తండ్రి కోచ్‌గా మరో దేశంలో కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. కొడుకు రాకీ మాత్రం మైదానంలో తన బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. 18 ఏళ్ల వయసులోనే భారీ శతకాలతో ఆకట్టుకుంటున్న రాకీ.. భవిష్యత్తులో ఇంగ్లండ్ క్రికెట్లో కీలక ఆటగాడిగా అడగనున్నాడు.
తాజావార్తలు
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!