PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..

  • ఇరాన్ యుద్ధంపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్..
  • ఫోన్ కాల్‌లో చేరిన ఎలాన్ మస్క్..
  • దేశాధినేతల కీలక ఫోన్ కాల్‌లో మస్క్ ఉండటంపై చర్చ..
Modi Trump

Modi Trump

PM Modi-Trump call: ఇరాన్ యుద్ధంపై ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో చర్చించారు. ఇరువురు నేతలు చర్చిస్తున్న సమయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్‌లో బిలయనీర్ ఎలాన్ మస్క్‌ కూడా పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. సాధారణంగా ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి కాల్‌లో కనిపించడం అసాధారణం. మంగళవారం అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీల మధ్య ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది.

Read Also: Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?

ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేని వ్యక్తిని, ఇలాంటి సంఘర్షణ సమయంలో ఫోన్ కాల్‌లో చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మిడిల్ ఈస్ట్ లో తీవ్రమవుతున్న సంక్షోభంపై ముఖ్యంగా ఇంధన రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణకు సంబంధించి ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పింది. ఇలాంటి ఒక కీలకమైన కాల్‌లో సాధారణ పౌరులను చేర్చడం అరుదని, సున్నితమైన జాతీయభద్రతా సమస్యలు చర్చలకు వచ్చే అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది.

అయితే, ఈ వ్యవహారంపై భారత్ స్పందించింది. ప్రధాని మోడీ, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న కాల్‌లో ఎలాన్ మస్క్ లేడని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. మస్క్ ఉన్నారంటూ వస్తున్న మీడియా నివేదికల్ని భారత్ ఖండించింది. ఈ నెల 24న మోడీ, ట్రంప్ ఇద్దరి మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగినట్లు భారత్ చెప్పింది.