PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..
- ఇరాన్ యుద్ధంపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్..
- ఫోన్ కాల్‌లో చేరిన ఎలాన్ మస్క్..
- దేశాధినేతల కీలక ఫోన్ కాల్‌లో మస్క్ ఉండటంపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi-Trump call: ఇరాన్ యుద్ధంపై ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్‌లో చర్చించారు. ఇరువురు నేతలు చర్చిస్తున్న సమయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్‌లో బిలయనీర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. సాధారణంగా ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి కాల్‌లో కనిపించడం అసాధారణం. మంగళవారం అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీల మధ్య ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది.
Read Also: Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేని వ్యక్తిని, ఇలాంటి సంఘర్షణ సమయంలో ఫోన్ కాల్‌లో చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. మిడిల్ ఈస్ట్ లో తీవ్రమవుతున్న సంక్షోభంపై ముఖ్యంగా ఇంధన రవాణాకు కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణకు సంబంధించి ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు చెప్పింది. ఇలాంటి ఒక కీలకమైన కాల్‌లో సాధారణ పౌరులను చేర్చడం అరుదని, సున్నితమైన జాతీయభద్రతా సమస్యలు చర్చలకు వచ్చే అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది.
అయితే, ఈ వ్యవహారంపై భారత్ స్పందించింది. ప్రధాని మోడీ, యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న కాల్‌లో ఎలాన్ మస్క్ లేడని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. మస్క్ ఉన్నారంటూ వస్తున్న మీడియా నివేదికల్ని భారత్ ఖండించింది. ఈ నెల 24న మోడీ, ట్రంప్ ఇద్దరి మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగినట్లు భారత్ చెప్పింది.
తాజావార్తలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్‌ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!