China: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అంతకుమందు, పుతిన్ ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే, స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. ఇద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసంలో నిర్వహించిన విందుకు హాజరయ్యారు.
Marko Rubio: ఢిల్లీ బాంబు పేలుళ్ల దర్యాప్తులో తమ దేశం భారతదేశానికి సహాయం అందించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం అన్నారు. భారత దర్యాప్తు సంస్థలను ప్రశంసించారు. "భారత్‌కు చెందిన దర్యాప్తు సంస్థలు చాలా ప్రొఫెషనల్, ఖచ్చితమైన దర్యాప్తును నిర్వహించగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి.
శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో పురోగతి లేకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ "ఎక్కువగా నిరాశ చెందారు" అని తెలిపారు. రష్యా చమురు సంస్థలపై తాజాగా విధించిన ఆంక్షలు మాస్కో ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయని పేర్కొనింది.
Trump: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో దీపాలు వెలిగించి దీపావళి జరుపుకొన్నారు. భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడాను. ఇద్దరం అద్భుతమైన సంభాషణ జరిపాం. వాణిజ్యం, అనేక విషయాలను చర్చించాం. ముఖ్యంగా వ్యాపార ప్రపంచం గురించి చర్చించుకున్నాం. ప్రపంచ వాణిజ్యంపై మోడీకి చాలా ఆసక్తి ఉంది.…
H-1B visa: H-1B visa వీసాపై డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో తీవ్ర ఆందోళన పెంచింది. వీసాల కోసం ఏకంగా USD 100,000 (రూ. 88 లక్షలు) చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికన్ డ్రీమ్ ఉన్న యువతను కంగారు పెట్టింది. ముఖ్యంగా, హెచ్1బీ వీసా కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
US-India: ఇరాన్ వ్యూహాత్మక ఓడరేపు విషయంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓడరేవులో కార్యకలాపాల కోసం 2018లో మంజూరు చేసిన ఆంక్షల మినహాయింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఓడరేవును భారత్ అభివృద్ధి చేస్తోంది. కీలకమైన టెర్మినల్స్ని డెవలప్ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు అమెరికా నిర్ణయం ఇండియాను ఇబ్బంది పెట్టేదిగా ఉంది.
Peter Navarro: అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్, ఆయన యంత్రాంగం కారణంగా రోజురోజుకు అమెరికాకు ప్రపంచ దేశాలతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. అమెరికా ప్రస్తుతం తనను తాను ప్రపంచానికి మకుటం లేని రాజుగా భావిస్తోంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ దేశమూ కూడా దాని నియంతృత్వానికి తలొగ్గడానికి సిద్ధంగా లేదు. ట్రంప్ యంత్రాంగం ప్రపంచంతో సంబంధాలను బలోపేతం చేసుకోడానికి దృష్టి సారించాల్సి ఉండగా, వాళ్లు దానికి బదులుగా మరింత దిగజారేలా మాట్లాడుతున్నారు. READ ALSO: Narayanan: ఆపరేషన్ సిందూర్‌కి 400…
India-US Relations: భారతదేశంపై ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ట్రంప్ 50 శాతం సుంకాలను విధించారు. దీనిపై అమెరికాలోనే వ్యతిరేకత వస్తోంది. భారత్ వంటి మిత్రదేశాన్ని దూరం చేసుకుంటోందని ట్రంప్ పరిపాలను అమెరికా నిపుణులు తిట్టిపోస్తున్నారు. అయితే, ఇప్పుడు భారత్‌కు మరో అనూహ్య మద్దతు లభించింది. భారతదేశంపై అమెరికా అధికారులు విమర్శలు పెంచుతున్న నేపథ్యంలో, వీటిని ఆ దేశంలోని యూదుల కమిటీ ఖండించింది.
US: డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు భారత్, రష్యాను మరింత దగ్గర చేయడమే కాకుండా, చైనాతో భారత స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాలా చేసింది. చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో మోడీతో పుతిన్, జిన్‌పింగ్‌లు భేటీ అయ్యారు. అయితే, ఈ పరిణామాలు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కి ఎక్కడా లేని కోపాన్ని తెప్పిస్తున్నట్లు తెలుస్తోంది.