రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తోందంటూ భారత్ చేసిన వాదనలపై విలేకరులు ట్రంప్‌ను క్వశ్చన్ చేశారు. మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోందా? అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ.. ఈ విషయం గురించి నాకు తెలియదు.. తెలుసుకుని.. త్వరలోనే మీకు సమాధానమిస్తానని చెప్పారు.
PM Modi: ప్రపంచ నాయకులు ‘డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచ నాయకుల్లో ఎవరికీ లేని ఆదరణ మోడీకి ఉన్నట్లు తేలింది. అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన ‘‘మార్నింగ్ కన్సల్ట్’’ శుక్రవారం విడుదల చేసిన డేటాలో మోడీ అగ్రస్థానంలో ఉన్నట్లు చూపించింది. ప్రధాని మోడీకి ఏంకగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉందని తెలిపింది.
గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. శాంతి చర్చల సమయంలో కూడా రెండు దేశాల సైన్యాలు వెనక్కితగ్గడం లేదు. అలాగే దాడులను కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ యుద్ధాన్ని ఆపడానికి.. పుతిన్ తాజాగా అంగీకరించినట్లు తెలుస్తోంది. కానీ అందుకోసం పలు షరతును విధించినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది.