Kulgam: కుల్గామ్‌లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- కుల్గామ్‌లో ఉగ్ర దాడి
- వలస కార్మికుడు మృతి
- మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కుల్గాం జిల్లాలోని కెల్లం ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈ దాడి జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కెల్లం ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు స్థానికేతర కార్మికులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో.. భద్రతా సిబ్బంది, స్థానిక అధికారులు వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్స పొందుతూ ఒక కార్మికుడు గాయాల తీవ్రతతో మృతి చెందాడు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. కెల్లం ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని.. అన్ని మార్గాలను దిగ్బంధించాయి. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి పట్టుకునేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read
- Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
- Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
- PM Modi: ‘నా చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే’.. ఖర్గే వ్యాఖ్యలకు మోదీ కౌంటర్..
- Sara Ali Khan: కేదార్నాథ్ వెళ్తే పాపమా?.. సారా అలీఖాన్‌కు ముస్లిం మతపెద్ద ఫత్వా..
కుల్గాం జిల్లాలో స్థానికేతర కార్మికులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ తాజా దాడితో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Kashmir
- Kulgam
- Terror Attack
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!