Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని రేపు నిర్ణయిస్తారు.. షిండే కీలక వ్యాఖ్యలు..
- సీఎం అభ్యర్థిపై ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు..
- రేపు సీఎంని నిర్ణయిస్తామని వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫలితాలు వచ్చి వారం గడిచినా, ఇంకా సీఎం ఎవరనే క్లారిటీ రాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ ‘‘మహాయుతి’’ కూటమి అఖండ విజయాన్ని సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 233 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలను గెలుచుకున్నాయి.
Read Also: Bihar: పెళ్లికి వెళ్లి మద్యం తాగారు.. 40 మందికి పైగా అరెస్ట్.. అసలు కారణం ఏంటంటే..
Also Read
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
- Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
అయితే, తాజాగా సీఎం అభ్యర్థి ఎంపికపై అపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహాయుతికి చెందిన ముగ్గురు మిత్రుల మధ్య మంచి అవగాహన ఉందని, సీఎం అభ్యర్థిని రేపు నిర్ణయిస్తామని చెప్పారు. ఇటీవల ఢిల్లీ పెద్దల్ని కలిసిన తర్వాత సీఎం షిండే సొంతూరు సతారాకు వెళ్లారు. జ్వరంతో బాధపడుతున్నట్లు తెలిసింది. తాను ఇప్పుడు బాగానే ఉన్నానని షిండే చెప్పారు. సీఎంగా 2.5 ఏళ్లలో ఎప్పుడూ సెలవు తీసుకోలేదని, ప్రజలన కలవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చానని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల మాట వింటుందని, పార్టీ నాయకత్వానికి తాను బేషరతు మద్దతు ఇచ్చానని, అందుకే ప్రజలు తమకు అఖండ విజయాన్ని ఇచ్చారని అన్నారు. ప్రజలు ప్రతిపక్ష నేతను కూడా ఎన్నుకునే అవకాశం ఇవ్వలేదని, ఏ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా దక్కలేదని అన్నారు.
#WATCH | Satara: Maharashtra caretaker CM Eknath Shinde says, "I am doing good now. I had come here to rest after the hectic election schedule… I did not take any leave during my 2.5 years as the CM. People are still here to meet me. This is why I fell ill… This government… pic.twitter.com/YYa8p7Sh1y
— ANI (@ANI) December 1, 2024
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?