Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- మదురాంతకం, ధారాపురంలో రేపే పోలింగ్
- విజయ్ జోరుగా ప్రచారం.. టీవీకేకు కీలక పరీక్ష
- స్టాలిన్, విజయ్ మధ్య మాటల యుద్ధం
- డీఎంకే, టీవీకే, అన్నాడీఎంకే మధ్య పోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఈ రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకే నిబంధనల ప్రకారం ప్రచార పర్వం ముగిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేపు ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుండగా, అక్టోబర్ 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి తుది ఫలితాలను వెల్లడించనున్నారు. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
రోడ్‌షోలతో హోరెత్తించిన విజయ్.. టీవీకేకు కీలక పరీక్ష
తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఈ రెండు ఉప ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. మదురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో వరుసగా నాలుగు రోజుల పాటు ఆయన విస్తృతంగా పర్యటించి జోరుగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ధారాపురంలో సుమారు 40 కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో చేపట్టి అభిమానులు, ఓటర్ల నుంచి విశేష స్పందన రాబట్టారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా విజయ్ శ్రమించగా, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన నాయకత్వ పటిమకు, పార్టీ ప్రజాదరణకు ఈ రెండు స్థానాల ఫలితాలు అత్యంత కీలకమైన పరీక్షగా నిలవనున్నాయి.
Also Read
- Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
- RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
- Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
- Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
వ్యక్తిగత వ్యాఖ్యలపై భగ్గుమన్న టీవీకే.. ఈసీకి ఫిర్యాదు
ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి టీవీకే అధినేత విజయ్, డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ధారాపురం టీవీకే అభ్యర్థి సత్యభామను ఉద్దేశించి సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై విజయ్ తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన సంస్కృతి కాదని, ఇటువంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన టీవీకే నాయకత్వం దీనిపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.
పట్టునిలుపుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే ఆరాటం
రాష్ట్రంలో కొత్తగా రాజకీయ ప్రభంజనం సృష్టిస్తున్న టీవీకేను ఎలాగైనా నిలువరించడమే ప్రధాన ధ్యేయంగా అధికార డీఎంకే విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. మరోవైపు గతంలో తమ ఆధీనంలో ఉన్న ఈ రెండు అసెంబ్లీ స్థానాలను తిరిగి దక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే (AIADMK) తీవ్రంగా శ్రమించింది. టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య తీవ్ర స్థాయిలో త్రిముఖ పోరు నెలకొనడంతో రేపటి పోలింగ్‌పై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!