ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs West Indies 3rd ODI-ICC fine: వెస్టిండీస్‌తో జరిగిన చివరి వన్డేలో భారత జట్టు విజయం ముంగిట బోల్తా పడింది. మూడో వన్డేలో విండీస్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్ అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. సెప్టెంబర్ 3న (శనివారం) ముల్లాన్‌పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, ప్రత్యర్థికి 352 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన సెంచరీతో (నాటౌట్ 162) చెలరేగడంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఆ జట్టు ఈ కొండంత లక్ష్యాన్ని ఊదేసింది. తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్న భారత జట్టు, ఈ ఆఖరి పోరులో ఓడిపోవడంతో కనీసం ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది.
గ్రౌండ్లో జరిగిన ఈ ఓటమికి తోడు, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్లకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంతో భారత్, వెస్టిండీస్ జట్లకు కఠిన జరిమానా విధించింది. మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయనందుకు గాను భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, వెస్టిండీస్‌కు 10 శాతం ఫైన్ వేసింది. నిర్ణీత సమయం కంటే టీమిండియా 4 ఓవర్లు వెనకబడిపోగా, వెస్టిండీస్ జట్టు 2 ఓవర్లు ఆలస్యంగా వేసింది. సమయానికి సంబంధించిన కొన్ని సడలింపులను పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, రెండు జట్లు కనీస ఓవర్ రేట్ నియమాన్ని ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్ ఈ జరిమానాలు విధించారు.
Also Read
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
- Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
- AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వేసే ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తారు. ఈ నిబంధనల ప్రకారమే 4 ఓవర్లు వెనకబడినందున భారత్‌పై 20 శాతం, 2 ఓవర్లు తక్కువ వేసినందుకు విండీస్‌పై 10 శాతం మేర పెనాల్టీ పడింది. అయితే స్లో ఓవర్ రేట్ తప్పును భారత్, వెస్టిండీస్ కెప్టెన్లు ఇద్దరూ ఒప్పుకోవడంతో పాటు ఐసీసీ విధించిన శిక్షను అంగీకరించారు. దీంతో ఈ అంశంపై ఎలాంటి విచారణ అవసరం లేకుండానే కేసు ముగిసిపోయింది. మైదానంలో విధులు నిర్వర్తించిన ఫీల్డ్ అంపైర్లు జయరామన్ మదన్ గోపాల్, సామ్ నోగాజ్స్కీలతో పాటు థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, ఫోర్త్ అంపైర్ వీరేందర్ శర్మలు ఈ స్లో ఓవర్ రేట్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. ఏది ఏమైనా, చివరి వన్డేలో ఇరు జట్లు ఆటపరంగానే కాకుండా స్లో ఓవర్ రేట్ రూపంలోనూ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
AP Localbody Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. SEC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
OTR: టీడీపీలో వారసుల రాజకీయం మొదలైందా? ఆ నేతల నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
-
Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
-
OTR : గులాబీ పార్టీలో కొత్త వ్యూహం మొదలైందా?
ట్రెండింగ్
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి