వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది.. 95 రోజుల్లోనే 13 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసింది.. అయితే, వయో వృద్ధులు, వికలాంగులకు, వీల్‌చైర్‌కే పరిమితం అయినవారికి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలని బాంబే హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది.. అయితే, వ్యాక్సీన్ ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వడం సాధ్యం కాదని బాంబే హైకోర్టుకు స్పష్టం చేసింది కేంద్రం.. ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తే తలెత్తే సమస్యలపై వివరాలను హైకోర్టుకు అందజేసింది..
కాగా, ధృతి కపాడియా, కునాల్ తివారీలు అనే న్యాయవాదులు బాంబే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.. 75 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు, వీల్‌చైర్‌కి పరిమితమైన వారు.. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లడం కష్టమని.. వారికోసం ఇంటి వద్దనే వ్యాక్సినేషన్‌కు అవకాశం కల్పించాలని కారు.. ఇక, ఆ పిల్‌పై స్పందించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. దాంతో ఎదురుయ్యే సమస్యలను వివరించింది.. వ్యాక్సీన్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే అప్పటికప్పుడు కేసు నిర్వహణ కష్టంగా మారుతుందని పేర్కొంది.. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించడానికి మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని.. వ్యాక్సినేషన్ తర్వాత కనీసం 30 నిమిషాల పాటు పేషెంట్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుందని.. కానీ, ఇంటి వద్దే వ్యాక్సిన్ ఇస్తే.. చాలా సవాళ్లు ఎదురవుతాయని తన అఫిడవిట్‌లో పేర్కొంది కేంద్రం.