Peddireddy Ramachandra Reddy: రాష్ట్ర ప్రజలకు ఎమ్మేల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తవుతుందని.. ఈ రెండేళ్లలో ఒక అభివృద్ధి పథకం గాని సంక్షేమ పథకం కానీ పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. అప్పుల కోసం వెంపర్లాడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని.. దోచుకున్న డబ్బులు విదేశాల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. నేడు లండన్ పర్యటన అని చెప్పి సింగపూర్లో వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నారని వదంతులు వస్తున్నాయన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
READ MORE: Arjun Tendulkar: 8 ఓవర్లలో 78 పరుగులు.. అర్జున్ టెండూల్కర్‌కు ఐపీఎల్ కూడా కష్టమేనా?
హామీల అమల్లో చంద్రబాబు, వైయస్ జగన్‌కు తేడా ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సూచించారు. “కరోనా సమయంలో కూడా ఇచ్చిన మాట మీద నిలబడిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్.. రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే రెండు లక్షల కోట్లు అప్పు చేశారు.. తెచ్చిన అప్పులు ఏ పథకాలకు వినియోగిస్తున్నారు, ఏ ప్రాజెక్టులు కడుతున్నారు? వైఎస్ జగన్ ప్రభుత్వంలో వీటన్నిటినీ వెలికితీసే పరిస్థితి వస్తుంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు.. ఈ ఏడాది నుంచి పార్టీ శ్రేణులు మరింత శ్రమించి పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నా.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Anam Ramanarayana Reddy: ఆలయాలు కాపాడటానికి రామలక్ష్మణుల్లా సీఎం, డిప్యూటీ సీఎం