దీపావళి పండుగ వేళ దేశం ఆర్థికంగానూ వెలిగిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. @CAITIndia రిసెర్చ్ & ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వే ప్రకారం, దీపావళి 2025 సీజన్లో భారత్ మొత్తం రూ. 5.40 లక్షల కోట్ల విలువైన వస్తువులు, రూ. 65,000 కోట్ల వ్యాపారాన్ని రికార్డ్ చేసింది. భారత్ లో జరిగే పండుగల్లో ఈ సారి దీపావళి పండుగ సందర్భంగా జరిగిన బిజినెస్ భారత రిటైల్ చరిత్రలో రికార్డ్ సృష్టించింది. సర్వే ఎలా జరిగిందో […]
Teacher Eligibility Test: దేశవ్యాప్తంగా 6–14 సంవత్సరాల పిల్లలకు విద్యనందిస్తున్న అన్ని పాఠశాలల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) తప్పనిసరి చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) పరిధికి రిఫర్ చేసింది. దేశంలోని అన్ని విద్యాసంస్థల్లో టెట్ పూర్తి చేసిన వాళ్లే ఉపాధ్యాయులుగా ఉండాలని, ఏ విద్యా సంస్థకు మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్న లా స్టూడెంట్ నితిన్ ఉపాధ్యాయ్ సుప్రీం కోర్టును […]
Supreme Court : దేశవ్యాప్తంగా కనిపించకుండా పోయిన పిల్లల కేసులపై పర్యవేక్షణకు ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురియా స్వయంసేవి సంస్థ (NGO) దాఖలు చేసిన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) విచారణ సందర్భంగా సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. Siddhu Jonnalagadda : ఉమనైజరా అన్న జర్నలిస్ట్.. చాలా డిస్రెస్పెక్ట్ఫుల్.. షాకింగ్ రియాక్షన్ మధ్యవర్తుల ద్వారా పిల్లలను ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ […]
RSS: ప్రధాని నరేంద్ర మోడీ రేపు (అక్టోబర్ 1) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే వేడుకలకు హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చరిత్రాత్మక ప్రయాణాన్ని ప్రతిబింబించే స్మారక తపాలా బిళ్ళ మరియు నాణేలు విడుదల చేయనున్నారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
దేశంలోని బార్ కౌన్సిల్ ల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 31 నాటికి ఎన్నికలు జరగని బార్ కౌన్సిల్ ల ఎన్నికలు పూర్తి చేయాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.
దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని విస్తరించేందుకు కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) దశ-3 కింద కొత్త సీట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. క్యాబినేట్ నిర్ణయంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, పీజీ ఇనిస్టిట్యూట్లలో 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెరుగనున్నాయి. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు వరకు ఖర్చు చేయడానికి కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. కొత్త సీట్ల పెంపుతో […]
GST 2.O.: జీఎస్టీ 2.O అమలుతో వివిధ రంగాలపై సానుకూల ప్రభావం కనిపిస్తోంది. పైగా జీఎస్టీ 2.O పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నూతన జీఎస్టీ నిర్ణయాలు దేశంలోని బొగ్గు రంగంపై సానుకూలంగా కనిపిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇద్దరికీ లాభం చేకూరేలా తాజా జీఎస్టీ నిర్ణయాలు సమతుల్యంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. జీఎస్టీ సంస్కరణల్లో కోల్ […]
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న 12వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరై.. “విజన్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్” అంశంపై ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి […]