Digvijaya Singh: ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోవాలి, వారు ఎప్పుడూ జైలుకు వెళ్లరు.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు…
- బద్ధ వ్యతిరేకి ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు నేర్చుకోవాలి..
- వారిని ఎదుర్కోవాలంటే వారి ఆటలోనే ఓడించాలి..
- కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Digvijaya Singh: కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆర్ఎస్ఎస్‌ని వ్యతిరేకించే దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ యూత్ కార్యకర్తలకు సూచించారు. మంగళవారం మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో నీట్ పేపర్ లీకులపై జరిగిన నిరసనల్లో ఆయన పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఆర్ఎస్ఎస్ తమకు బద్ధ ప్రత్యర్థి అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ నుంచి నేర్చుకోంది. వారు మైండ్ గేమ్ ఆడుతారు. వారు ఎప్పుడూ నిరసన చేయరు, ప్రదర్శనలు చేయరు, ఎప్పటికీ వారు లాఠీఛార్జ్‌లను ఎదుర్కోరు, జైళ్లకు వెళ్లరు. కానీ వారు మనల్ని జైలుకి పంపుతారు’’ అని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
READ ALSO: AP Weather: కొనసాగుతున్న అల్పపీడనం.. కోస్తాంధ్రకు 2 రోజుల పాటు భారీ వర్షసూచన
Also Read
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
అట్టడుగు స్థాయిలో సంస్థాగత నెట్వర్క్ లేకుంటే నిరసనలు ప్రభావంతంగా ఉండవని ఆయన అన్నారు. బూత్ నుంచి జిల్లా వరకు మూడు స్థాయిల్లో ఆందోళనలు నిర్వహించాలని సూచించారు. ‘‘ఆర్ఎస్ఎస్ సాధారణంగా మూడు విషయాలపై దృష్టిపెడుతుంది. కరపత్రాలను పంపిణీ చేస్తుంది. చర్చలు నిర్వహిస్తుంది. చివరకు ఉద్యమాన్ని నిర్మిస్తుంది. మీరు వారితో పోరాడాలంటే, వారి సొంత ఆటలో వారిని ఓడించాలి. శారీరకంగా కాదు మేధోపరంగా ఆట సాగాలి’’ అని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యనిర్వహణ మరియు ప్రచారాన్ని అర్థం చేసుకోవడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ప్రదర్శనపై ఆయన నిరాశ వ్యక్తం చేశారు. పార్టీ పరాజయానికి కారణాలను విశ్లేషించుకోవాలని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని బీజేపీ చెప్పగా, అది 250 సీట్లకు కూడా పడిపోయిందని, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు వల్లే బీజేపీ మెజారిటీ వచ్చిందని సింగ్ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) చైర్‌పర్సన్ ప్రదీప్ కుమార్ జోషిని ఆయన విమర్శించారు, పరీక్షను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
ట్రెండింగ్
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!