Digvijaya Singh: కరుడుగట్టిన కాంగ్రెస్ నేత, ఆర్ఎస్ఎస్ బద్ధవ్యతిరేకించే దిగ్విజయ్ సింగ్, ఆ సంస్థను పొగిడారు. సమర్థవంతమైన కమ్యూనికేషన్, సంస్థాగత విస్తరణపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ యూత్ కార్యకర్తలకు సూచించారు.
NEET-UG paper leak: నీట్, యూజీసీ నెట్ పేపర్ లీక్స్ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని ప్రక్షాళన చేసేందుకు కేంద్రం కమిటీని నియమించింది.
NEET issue: నీట్ సమస్య, పేపర్ లీకులపై ప్రధాని నరేంద్రమోడీ లోక్‌సభలో స్పందించారు. దేశంలో ఇలాంటి ఘటనలు నివారించేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ప్రతీ విద్యార్థికి, దేశంలో ప్రతీ యువకుడికి చెబుతున్నానని భరోసా ఇచ్చారు.
నీట్ అవకతవకలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు.