ముడా కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఈ కేసులో సిద్ధరామయ్య నిర్దోషి అంటూ లోకాయుక్త ఇచ్చిన నివేదికను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తోసిపుచ్చింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు నివేదికను ఈడీ సవాల్ చేసింది. లోకాయుక్త నివేదికను కొట్టివేయాలంటూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ముడా భూమి స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు కోరుతూ ఓ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు స్వతంత్రంగా ఉందని పేర్కొంది. ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకి అప్పగించాలని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది.…
MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్(ముడా) ల్యాండ్ స్కామ్‌లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతంలో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనపై విచారణకు ఆదేశాలు ఇవ్వడాన్ని సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశారు. అయితే, సీఎం పిటిషన్‌ని నిన్న కర్ణాటక హైకోర్టు కోట్టేసింది. దీంతో విచారణకు మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే ట్రయల్ కోర్ట్ సీఎంపై కేసు నమోదు చేసి, విచారణ జరపాలని లోకాయుక్తాని ఈ రోజు ఆదేశించింది.
MUDA land scam: మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ ఇచ్చింది. ముడా ల్యాండ్ స్కాంలో సీఎంపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ విచారణకు ఆదేశించారు. అయితే, దీనిని సవాల్ చేస్తూ సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ రోజు దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నాగ ప్రసన్నతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించారని, వాస్తవాలు వెలుగులోకి రావాలి’’ అని, సిద్ధరామయ్య పిటిషన్‌ని…