దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ వేధిస్తోంది. వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వేడిమి నుంచి ఉపశమనం పొందే వార్త చెప్పింది. మంగళవారం నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షంతో నగర వాసులు వేడి నుంచి సేదదీరారు.
ఇది కూడా చదవండి: Bail to Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే..!
ఇక పలు ప్రాంతాల్లో బలమైన దుమ్ముతో ఈదురుగాలులు వీచాయి. గురుగ్రామ్‌లో తుఫాన్ లాంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో సాయంత్రం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు.
ఇది కూడా చదవండి: Khawaja Asif: ఇంగ్లీష్ రాకుంటే ఎందుకు మీడియా ముందుకు..? పాక్ రక్షణ మంత్రి కామెడీ మామూలుగా లేదు..
మంగళవారం సాయంత్రం నుంచి రాబోయే రెండు గంటల్లో ఢిల్లీ మరియు ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. మధ్య, తూర్పు, న్యూఢిల్లీ, ఉత్తర, ఈశాన్య, వాయువ్య, షాహ్దారా, దక్షిణ, ఆగ్నేయ, నైరుతి మరియు పశ్చిమ ఢిల్లీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి..!