దేశ రాజధాని ఢిల్లీకి కేంద్ర వాతావరణ శాఖ ఉరుములతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. ముందస్తు రుతుపవనాల రాక కారణంగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండ వేధిస్తోంది. వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం ఢిల్లీకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంతేకాకుండా హస్తినలో గాలి నాణ్యత మరింత క్షీణించినట్లుగా తెలిపింది.