ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం అతిషి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాను కలిసి రాజీనామాను సమర్పించారు. సోమవారం ఆమె రాజీనామాను ఎల్జీ ఆమోదించారు.
ఇది కూడా చదవండి: Dhanush: ఏడిపించేలా ‘జాబిలమ్మ నీకు అంతా కోపమా’ ట్రైలర్
తాజాగా జరిగిన ఎన్నికల్లో అతిషి.. కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మాత్రం ఘోర పరాజయాన్ని ముటకట్టుకున్నారు. పర్వేష్ శర్మ చేతిలో కేజ్రీవాల్ ఓడిపోయారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలిచింది. ఇదిలా ఉంటే బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయలేదు. ప్రధాని మోడీ ప్రస్తుతం 2 దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్, అమెరికా వెళ్లారు. 4 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సీఎం రేసులో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: Jay Shah: ప్రాణాలను కాపాడండి.. జై షా పోస్ట్ వైరల్!