Indigo Crisis: ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
- ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
- ఇలా ఎందుకు జరిగిందని కేంద్రానికి ప్రశ్న
- అధిక ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి గందరగోళం ఎందుకు తలెత్తిందంటూ తీవ్రంగా మందలించింది. ఇక ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఎలా అనుమతించబడ్డాయని న్యాయస్థానం నిలదీసింది. అసలెందుకు ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రాన్ని అడిగింది.
ఇది కూడా చదవండి: JD vance-Usha: రెస్టారెంట్‌లో జేడీవాన్స్-ఉషా వాన్స్ ఘర్షణ.. ఫొటో వైరల్!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
వందలాది విమానాలు ఒకేసారి ఎందుకు క్యాన్సిల్ అయ్యాయని కేంద్రాన్ని మందలించింది. ఇక విమాన ఛార్జీలు రూ.40,000 పెంచకుండా నిరోధించడంలో విఫలమైనట్లుగా తప్పుపట్టింది. సంక్షోభ సమయంలో ఇతర విమాన సంస్థలు ఎందుకు ధరలు పెంచేశాయని ధర్మాసనం అడిగింది. కేంద్రం తీసుకున్న చర్యల జాబితాను అదనపు సొలిసిటర్ జనరల్ చదివి వినిపించారు. అయితే ఈ సంక్షోభం ఎందుకు తలెత్తిందంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. పైలట్లు ఎందుకు ఎక్కువ పనిభారంతో బాధపడుతున్నారో.. దానిని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా కేంద్రాన్ని ప్రశ్నించింది.
ఇది కూడా చదవండి: Gujarat: ఓ అమ్మాయిపై ఇద్దరి స్నేహితులు మక్కువ.. చివరికేమైందంటే..!
‘‘మీ ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము. ప్రశ్న ఏమిటంటే.. అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది విమానాశ్రయాల్లో వ్యక్తిగత ప్రయాణీకులు చిక్కుకుపోవడం మాత్రమే కాదు. ఈ ప్రశ్న ఆర్థిక వ్యవస్థకు నష్టం. ఇది ప్రయాణీకులకు వేధింపులు. ప్రయాణీకులకు పరిహారం చెల్లించడానికి ఏ చర్యలు తీసుకున్నారు? సర్వీస్ ప్రొవైడర్ల ఉద్యోగులు బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చూసుకోవడానికి ఏ చర్యలు తీసుకున్నారు?.’’ అని కేంద్రాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది.
గత వారం నుంచి దేశంలో ఇండిగో సంక్షోభం తలెత్తింది. వందిలాది విమానాలు రద్దు అవ్వడంతో దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం నెలకొంది. వేలాది మంది ప్రయాణికులు తిండి తిప్పలు మానేసి విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాశారు. ఇక లగేజీలతో ఎయిర్‌పోర్టులు డంప్ యార్డులుగా మారాయి. ఇక హఠాత్తుగా ప్రయాణాలు ఆగిపోవడంతో ప్రయాణికులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?