ఉగాదితో తెలుగువారందరికీ కొత్త సంవత్సరం ప్రారంభమైనట్టు కేరళ, తమిళనాడు ప్రాంత వాసులకు ఏప్రిల్ 14తో నూతన సంవత్సరం మొదలైంది. ఈ విషును సెలబ్రిటీలంతా ఘనంగా సెలబ్రేట్ చేసారు. ఈ సందర్భంగా కోలీవుడ్, మాలీవుడ్ హీరోలు తమ అప్ కమింగ్ చిత్రాలకు సంబంధించి అప్ డేట్స్ షేర్ చేసుకున్నారు. అమరన్ తో సూపర్ హిట్ కొట్టిన శివ కార్తికేయన్ లేటెస్ట్ మురుగదాస్ డైరెక్షన్ లో చేస్తున్నసినిమా మదరాసి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది యూనిట్. రీసెంట్లీ రూమర్ క్రియేట్ చేసిన సెప్టెంబర్ 5కే థియేటర్లలో బొమ్మ రాబోతుంది.
Also Read : Prithviraj Sukumaran : మూడు ఇండస్ట్రీలను మడతెట్టేస్తున్న ‘వరద’
మాలీవుడ్ స్టార్ యాక్టర్.. నివిన్ పౌలీ విషు సందర్భంగా ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. బేబీ గర్ల్ అనే మూవీకి ఏప్రిల్ 14న కొబ్బరి కాయ కొట్టారు. ఫస్ట్ కుంచికో బొబన్ హీరోగా అనుకుంటే ఆయనకున్న కమిట్మెంట్స్ వల్ల డేట్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నివిన్ చెంతకు చేరింది. 2023లో మలయాళంలో వచ్చిన గరుడన్ ఫేం అరుణ్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఫహాద్ ఫజిల్, కళ్యాణీ ప్రియదర్శన్ జంటగా నటిస్తోన్న మూవీ ఒదుం కుతిరా చదూం కుతిరా ఫస్ట్ లుక్ పోస్టర్ విషు సందర్భంగా రిలీజ్ చేశారు. రొమాంటిక్ కామెడీ జోనర్‌లో క్రేజీ వెడ్డింగ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ అల్తాఫ్ సలీమ్. అలాగే తెలుగులో ఈగ తరహాలో మలయాళంలో ఫ్లైతో సరికొత్త ప్రయోగం చేస్తున్నారు. లవ్లీ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న మూవీ నయా అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను గతంలో ఏప్రిల్ 4న విడుదల చేయాలనుకోగా ఇప్పుడు మే 4కు పోస్ట్ పోన్ అయిందని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేసారు. మొత్తానికి పండగ కానుకాగా సినిమాల విశేషాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు మేకర్స్.