దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో హస్తినలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఎట్టకేలకు పీడబ్ల్యూడీ అధికారులు అధికారిక నివాసం కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిషి షిప్ట్ అయ్యారు. వస్తువులన్నీ తరలించారు.
దేశ రాజధానిలోని రోడ్ల పరిస్థితులను ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి సోమవారం పరిశీలించారు. అనంతరం దీపావళి వరకు ఢిల్లీలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందిస్తామని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారం రోజులపాటు ఢిల్లీలోని 1400 కిలోమీటర్ల రోడ్లను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలించనున్నారు. గుంతల రోడ్లను గుర్తించి మరమ్మతులు, రిపేర్లకు ఢిల్లీ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది
Delhi CM Atishi: ఈ నెల 21వ తేదీన (శనివారం) ఢిల్లీ రాష్ట్ర ఎనిమిదో ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, ఈరోజు (సోమవారం) ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా తర్వాత.. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రిగా 'అతిషి' ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిషి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.