Delhi Air Pollution: ఢిల్లీలోకి యాప్- ఆధారిత ట్యాక్సీలపై నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. నిన్న ఏయిర్ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కాలుష్యంపై హర్యానా, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల కాల్చివేతను ఎలాగైనా అడ్డుకోవాల్సిందే అని నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. దీంతో పాటే ఢిల్లీలో యాప్ బేస్డ్ క్యాబులపై నిషేధం విధించాలని ఆప్ ప్రభుత్వానికి సూచించింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ రోజు ఢిల్లీ రవాణా మంత్రి గోపాల్ రాయ్ అధికారులతో సమావేశమయ్యారు. ఇతర రాష్ట్రాల యాప్ ఆధారిత క్యాబ్‌లను ఢిల్లీలోకి నిషేధించారు. నిన్నటి విచారణలో సుప్రీంకోర్టు.. ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు రిజిస్ట్రేషన్లు కలిగిన యాప్ ఆధారిత ట్యాక్సీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని గుర్తించామని, ఒక్కొక్క ప్రయాణికుడు ఒక్కో క్యాబ్ లో వెల్లడాన్ని ప్రశ్నించింది. కాలుష్యాన్ని అదుపు చేయడానికి క్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని సూచించింది.
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
Read Also: Mukesh Ambani: ముకేష్ అంబానీ అంటే మామూలుగా ఉండదు.. భార్యకు రూ. 10 కోట్ల కార్ గిఫ్ట్..
ఢిల్లీ ప్రభుత్వం నగరంలో సరి-బేసి విధానంలో వాహనాల రాకపోకలను నిర్వహిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. గత సంవత్సరం ఈ విధానం ఎలా పనిచేసిందో విశ్లేషించారా.? అని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోర్టు సమీక్ష తర్వాత ఈ విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.
ప్రతీ ఏడాది శీతాకాలంలో ఢిల్లీలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది. పంజాబ్, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చివేయడంతో ఈ సమస్య తీవ్రత పెరుగుతోంది. నిన్నటి సుప్రీంకోర్టు విచారణలో ఢిల్లీలో, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా ఆప్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాదా.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!