కరోనా పేరు మళ్లీ జనాల్లో వినిపిస్తుంది.. గత రెండేళ్లుగా ఊపిరి పీల్చుకున్న జనాలు ఇప్పుడు కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భయ బ్రాంతులకు గురవుతున్నారు.. కొత్త వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది.. ఈ వైరస్ వ్యాప్తి పై ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే 21 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలుస్తుంది..
మరోవైపు జేఎన్.1 వేరియంట్ ప్రబలడంతో దేశవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులో 614 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.. ప్రస్తుతం పెరుగుతున్న కరోనా కేసుల వల్ల ఆందోళన పడవద్దని, స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.. ఇప్పటికే కర్ణాటకలో ఓ వృద్ధుడు మరణించినట్లు తెలుస్తుంది..
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యశాఖ వెల్లడించింది. కొవిడ్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య 14 ఉన్నట్లు, నమోదైన కొత్త కేసులన్నీ హైదరాబాద్ లోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో జేఎన్ .1 వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది.. మరోవైపు ఆంధ్రాలో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటు ప్రభుత్వ నియమాలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు..బుధవారం ఒక్కరోజే నాలుగు పాజిటివ్ కేసులు పెరిగినట్లు తెలుస్తుంది.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు..