NTA: ఎన్టీఏ భవనాన్ని ముట్టడించి, లాక్ చేసిన కాంగ్రెస్ విద్యార్థి విభాగం..
- ఎన్టీఏ కార్యాలయంలోకి కాంగ్రెస్ విద్యార్థి విభాగం..
- పేపర్ లీకులపై నిరసన..
- లోపలి నుంచి కార్యాలయానికి లాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTA: నీట్, యూజీసీ-నెట్ పేపర్ లీక్స్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే యూజీసీ-నెట్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) రద్దు చేసింది. పరీక్షా పత్రాలు డార్క్‌వెబ్‌లో లీక్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పేపర్ లీకులపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే నీట్ పరీక్షాపత్రం లీక్‌కి సంబంధించి పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. మరోవైపు ఎన్టీఏ నిర్మాణం, పనితీరు, పారదర్శకతపై కేంద్రం కమిటీని నిర్ణయించింది.
Read Also: Pranava East Crest: లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈస్ట్ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే..
Also Read
- EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
- Sugar Price Hike: ఇథనాల్ కాదు.. చక్కెర ధరలు పెరగడానికి కారణాలు ఇవే.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- Amravati: వెంటిలేటర్లో పేలుడు.. NICUలో మంటలు.. ముగ్గురు నవజాత శిశువులు మృతి.!
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)కి చెందిన 100 మంది వరకు కార్యకర్తలు ఎన్టీఏ భవనంలోకి దూసుకెళ్లారు.నీట్ పరీక్షల అవకతవకలపై నిరసన తెలిపేందుకు ఢిల్లీ కార్యాలయంలోకి వారంతా వెళ్లారు. కార్యాలయం లోపలి నుంచి లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రవేశ పరీక్షల అవకతవకలతో ఎన్టీఏపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై కేంద్రాన్ని కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఎన్టీఏ కేంద్ర కార్యాలయంలోకి వెళ్లారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ ట్వీట్ చేసింది. మోడీ ప్రభుత్వం ‘పేపర్ లీక్’ ప్రభుత్వమని ఆరోపించింది. దేశంలో నిత్యం పేపర్లు లీక్ అవుతున్నాయని, విద్యా్ర్థులు వీధుల్లో ధర్నాలు చేస్తున్నా, నిరంకుశ మోడీ ప్రభుత్వం మాత్రం ఊరుకోవడం లేదని చెప్పింది. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఈ రోజు విద్యార్థులు తమ గళం విప్పారు. కాంగ్రెస్ రోడ్డు మీద నుంచి పార్లమెంట్ వరకు పేపర్ లీక్ అంశాన్ని లేవనెత్తుతోంది, యువతకు న్యాయం చేస్తామని పేర్కొంది.
- Tags
- congress
- NEET paper leak
- NSUI
- NTA
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..