మెడికల్ అడ్మిషన్ పరీక్ష అయిన నీట్-యూజీ కోసం విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. నీట్-యూజీ పరీక్ష నేడు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5,500 కి పైగా కేంద్రాలలో జరుగనుంది. వీటిలో విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరీక్షలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. కానీ పరీక్షకు…
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షకు తుది ఆన్సర్ కీని అధికారికంగా విడుదల చేసింది. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇప్పుడు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in నుంచి తుది ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 11న తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసిన విషయం తెలిసిందే.
JEE Mains 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ రోజు (జనవరి 31) నుండి ప్రారంభించింది. విద్యార్థులు ఈ సెషన్ 2 పరీక్షలో హాజరయ్యేందుకు 24 ఫిబ్రవరి 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షను జనవరి 22 నుంచి జనవరి 30 వరకు…
NEET-UG 2025: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET-UG) 2025 కొత్త నియమాలను, షెడ్యూల్‌తో నిర్వహించబోతున్నట్లు జాతీయ పరీక్షా సంస్థ (NTA) గురువారం ధృవీకరించింది. 2024లో పరీక్షలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నీట్-యూజీ 2025 పెన్ను పేపర్ పద్ధతిలో (ఓఎంఆర్ షీట్), ఒకే రోజు మరియు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం తీసుకున్న పెన్-పేపర్ పద్ధతిలో పరీక్ష నిర్వహించాలనే నిర్ణయం సురక్షితమైన, న్యాయమైన పరీక్షా ప్రక్రియకు తోడ్పడుతుందని…
UGC NET 2025 : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ 2024 సెషన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో జరుగుతున్నాయి. జనవరి 3న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 16 వరకు కొనసాగనున్నాయి. అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగవలసిన పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎన్టీయే పేర్కొంది. జనవరి 16న నిర్వహించవలసిన పరీక్ష మాత్రం…
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్‌ను jeemain.nta.nic.in లేదా nta.ac.inలో చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు అక్టోబర్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ కోసం నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివ్‌గా ఉంటుంది.
CSIR UGC NET Result 2024: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చర్‌షిప్ కోసం CSIR UGC NET ఫలితాలు, కట్ ఆఫ్ మార్కులను ప్రకటించింది. CSIR NET జూన్ 2024 పరీక్షలో హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csirhrdg.res.in నుండి కట్ ఆఫ్ మార్కులు, అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 2024 కోసం జాయింట్ CSIR-UGC పరీక్ష 2024 జూలై 25, 26, 27 తేదీల్లో…
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. మే 5న జరిగిన నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, అవకతవకలు జరిగాయని నీట్ యూజీ పునఃపరీక్ష నిర్వహించాలని కోరుతూ 40కి పైగా అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేశారు.
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ప్రస్తుత దశలో పరీక్షాల ఫలితాలు విఫలమయ్యాయని లేదా ఏదైనా క్రమబద్ధమైన ఉల్లంఘన జరిగిందని నిర్ధారించే అంశాలు రికార్డులో లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.
NEET Paper Leaks Case: నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ నేడు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలల బంద్ చేయాలని కోరుతూ..