Manjima Mohan Emotional Comments on Trolls: అన్వేషణ, అభినందన లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఒకప్పటి తమిళ హీరో ‘కార్తీక్’. అతని కొడుకుగా ‘గౌతమ్ కార్తీక్’ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాట హీరోగా సెటిల్ అయిన ‘గౌతమ్ కార్తీక్’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ ‘మంజిమ మోహన్’ని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య చెన్నైలోని ఒక హోటల్ లో మొన్నీమధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ముత్తయ్య డైరెక్ట్ చేసిన ‘దేవరట్టం’ సినిమాలో గౌతమ్, మంజిమ కలిసి నటించారు. ఆ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్న్నారు. చివరిగా 2023లో బూ చిత్రంలో నటించిన మంజిమ ఆ తర్వాత ఏ సినిమాలోనూ నటించలేదు.
Lucky Bhaskar: పవన్ కళ్యాణ్ తో పోటీకి దిగిన దుల్కర్ సల్మాన్
ఓ ఇంటర్వ్యూలో నేను పెళ్లికి ముందే గర్భవతినని, మామగారికి పెళ్లిపై ఆసక్తి లేదని తప్పుడు సమాచారం ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక్క నిజం ఏమిటంటే, ఈ పుకార్లు మా కుటుంబాన్ని బాధించాయి, చాలా మంది మా వివాహం గురించి సంతోషంగా ఉన్నారు, కొందరు వెక్కిరించారు. పెళ్లికి ముందు నేను కొన్ని కామెంట్స్ ఎదుర్కొన్నాను కానీ అది నన్ను ప్రభావితం చేయలేదు. అయితే పెళ్లయ్యాక దీని గురించి నేను ఆందోళన చెందుతున్నాను, ఇలాంటి కామెంట్స్ చదివి ఎందుకు బాధపడతావని గౌతమ్ నన్ను అంటూ ఉంటాడు. అతనికి నేను సరిగ్గా సరిపోను అన్న కామెంట్స్ చూస్తుంటే బాధ కలుగుతుంది. సినిమాల విషయంలో నేనే ఫెయిల్యూర్ అయ్యా కానీ గౌతమ్ ఎప్పుడూ నాకు సపోర్ట్ గానే ఉంటాడు అని ఆమె చెప్పుకొచ్చింది.