Tariff Risk: ట్రంప్ మరో షాక్.. భారత వస్తువులపై 100 శాతం టారిఫ్‌లు విధించేలా చట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tariff Risk: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌కు మరోషాక్ ఇచ్చారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థిక ఇంధనాన్ని అందిస్తున్న దేశాలపై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సెనెట్ (యూఎస్ ఎగువ సభ) సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తులను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనా, భారత్ వంటి దేశాలపై భారీగా జరిమానాలు, సుంకాలను విధించే ప్రతిపాదిత బకాయి బిల్లుకు సెనెట్ 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఆమోదం తెలిపింది. ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’గా నామకరణం చేసిన ఈ బిల్లు ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అపరిమిత అధికారాలు దక్కనున్నాయి. రష్యా నుంచి ముడి చమురు, గ్యాస్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న టాప్-5 దేశాలైన చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియాల నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధించేందుకు ఈ చట్టం అధ్యక్షుడికి వెసులుబాటు కల్పిస్తుంది.
రష్యాపై కఠిన ఆంక్షలతో పాటు, ఇరాన్ శక్తి రంగానికి మద్దతిచ్చే కంపెనీలపై చర్యలు తీసుకునే ‘ఇరాన్ శాంక్షన్స్ యాక్ట్ 1996’ గడువును ఈ బిల్లు 2031 వరకు పొడిగిస్తుంది. ద్విపాక్షిక మద్దతుతో రూపుదిద్దుకున్న ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం, డెమొక్రాట్ రిచర్డ్ బ్లూమెంతల్ రూపొందించారు. కాగా, కీవ్ పర్యటన తర్వాత జూలై 11న సెనేటర్ గ్రాహం అకస్మాత్తుగా కన్నుమూశారు. దాంతో ఉక్రెయిన్ మద్దతుదారుడైన ఆయన జ్ఞాపకార్థం, ఇరు పార్టీల నాయకులు పట్టుబట్టి ఈ బిల్లును వేగవంతంగా ఆమోదింపజేశారు. గ్రాహం మరణానంతరం ఆయన స్థానంలో సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన సోదరి డార్లీన్ గ్రాహం మాట్లాడుతూ.. “రష్యా ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్న దేశాలకు ఈ బిల్లు ఒక స్పష్టమైన హెచ్చరిక. అమెరికాతో వ్యాపారం చేస్తారా? లేక చౌకైన రష్యన్ ఇంధనాన్ని కొనుగోలు చేస్తారా? అనే తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది” అని స్పష్టం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అక్కడ సంపన్న వ్యాపారవేత్తలు (ఒలిగార్క్స్), ఆర్థిక సంస్థలపై కఠిన ఆంక్షలు విధించడం కూడా ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. ఈ ఓటింగ్ అనంతరం సెనేటర్ బ్లూమెంతల్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ తీవ్రమైన ఆంక్షలు, టారిఫ్‌లు అక్రమ యుద్ధానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్న వారిని ఖచ్చితంగా నిలువరిస్తాయని అన్నారు.
Also Read
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!