Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- కర్ణాటకలో ఘోర విషాదం
- గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- వాలీబాల్ ఆడుతుండగా ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో ఘోర విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా 10వ తరగతి విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన దక్షిణ కన్నడ జిల్లాలోని సూరింజె సమీపంలోని సూరత్కల్ ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మృత విద్యార్థి లిఖిత్ అమీన్ (15)గా గుర్తించారు. సూరింజెలోని గవర్నమెంట్ హైస్కూల్, కోటె బొల్లారులో ఎస్ఎస్ఎల్సీ (10వ తరగతి) చదువుతున్నాడు.
స్నేహితులతో కలిసి సూరింజె మైదానంలో వాలీబాల్ ఆడుతున్న సమయంలో లిఖిత్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. సీసీటీవీ దృశ్యాల ప్రకారం.. ముందుగా బంతిని సర్వ్ చేసిన లిఖిత్, ప్రత్యర్థి జట్టు కొట్టిన బంతిని తిరిగి ఆడేందుకు నెట్ వైపు పరుగెత్తాడు. కొద్ది క్షణాలకే చేతులను పైకెత్తి ఒక్కసారిగా మైదానంలో కుప్పకూలిపోయాడు. కిందపడిపోవడంతో అక్కడున్న తోటి విద్యార్థులు, ఇతరులు వెంటనే అతడి దగ్గరకు చేరుకుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే లిఖిత్ మృతి చెందినట్లు నిర్ధారించారు.
Also Read
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
విద్యార్థి మృతికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి అసలు కారణం వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, విద్యార్థి ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..