Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపీ) రాహుల్ గాంధీపై మాజీ కాంగ్రెస్ నేత, ఆధ్యాత్మిక గురువు ఆచార్య ప్రమోద్ కృష్ణం శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి పాకిస్తాన్ లో ఫుల్ క్రేజ్ ఉందని, ఆయన అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తే భారీ తేడాతో గెలుస్తారని ఆయన అన్నారు. రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని వీడియోలు పాకిస్తాన్ మీడియాలో, అక్కడి సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ప్రమోద్ కృష్ణం ఈ వ్యాఖ్యలు చేశారు.
Acharya Pramod Krishnam: కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కి అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లే, ఆయన ఇండియా కూటమికి ‘‘పిండప్రధానం’’ చేస్తారని కల్కిథామ్ పీఠాధీశ్వర్ ప్రమోద్ కృష్ణం విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ మాజీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సుప్రీంకోర్టు రామమందిర తీర్పును రద్దు చేస్తానని రాహుల్ గాంధీ శపథం చేశాడని ఆయన సోమవారం అన్నారు.
Congress: జూన్ 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుగా ముక్కలవుతుందని మాజీ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్న కారణంగా అతడిని బహిష్కరించాలని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఇటీవల ఆయన ప్రధాని మోడీని కూడా కలివారు. ఫిబ్రవరి 19న ఉత్తర్ ప్రదేశ్ సంభాల్‌లో శ్రీ కల్కి ధామ్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
Congress: సీనియర్ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం, సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కాంగ్రెస్ నేతలు రాముడి, హిందువులను ద్వేషిస్తున్నాంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని ద్వేషించే వ్యక్తి హిందువు కాలేడని, రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసని ఆయన అన్నారు. కాంగ్రెస్ సభ్యుడిగా ఉండటం అంటే నిజం చెప్పలేనని అర్థం కాదని ఆయన అన్నారు.