PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- మోదీ విదేశీ పర్యటనలకు రూ.74.5 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడి.
- రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన విదేశాంగ శాఖ.
- 2021-2025 మధ్య భారత్‌కు 381.8 బిలియన్ డాలర్ల FDI వచ్చినట్లు ప్రకటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 23 దేశాలకు చేసిన విదేశీ పర్యటనల కోసం దాదాపు రూ.187 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. అలాగే 2026లో ఇప్పటివరకు జరిగిన విదేశీ పర్యటనలపై రూ.74.58 కోట్లు వ్యయమైనట్లు తెలిపింది. ఇందులో ఈ ఏడాది జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల వ్యయం కూడా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీపీఎం ఎంపీలు సంజయ్ సింగ్, వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి పవిత్ర మార్గరీటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
2021 నుంచి ప్రధాని విదేశీ పర్యటన వివరాలు, వాటికి అయిన ఖర్చు, పర్యటనల సందర్భంగా కుదిరిన ఎంఓయూలు, అలాగే దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) సమాచారాన్ని పార్లమెంట్‌కు సమర్పించారు. ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్ 2025 వరకు భారత్‌లోకి 381.8 బిలియన్ డాలర్ల FDIలు వచ్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ పర్యటనల ద్వారా సాంకేతిక, ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో అనేక కీలక ఒప్పందాలు కుదిరినట్లు కేంద్రం చెప్పింది. ఇదే సమయంలో ఆయా దేశాలతో భారత సంబందాల బలోపేతమైనట్లు తెలిపింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!