The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise Teaser Review: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్లో నాని పూర్తిగా కొత్త, రా అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించారు. పవర్ఫుల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాని పాత్రలోని మాస్ యాంగిల్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రత్యేకంగా చూపించారు.
ఇక నుంచి ఈ జాగ మనదే.. ఈ దేశమే మనదే.. సర్కార్ ఉన్నది మీ దొరల కోసమా.. మా జనం కోసమా, అణచపడ్డ మన జాతి మరలబడాలే, ఛీ అని చీధరించుకున్న నలుపు రంగే మన జెండా వంటి పవర్ ఫుల్ డైలాగ్స్‌తో ఈ టీజర్ హోరెత్తించింది. ప్రతీ ఫ్రేమ్ కొత్తగా ఉంది. నానీ ఈ చిత్రంలో శ్రీకాంత్ ఓదెల ఊర మాస్ యాంగిల్లో చూపించినట్లు అర్థం అవుతుంది. మొత్తంగా చూస్తే ఈ టీజర్లో నానితో శ్రీకాంత్ ఓదెల బ్లడ్ బ్లాత్ చేయించారు. ‘దసరా’ తర్వాత నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు పలు భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!