The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise Teaser: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఇప్పటి వరకు తీసింది కేవలం ఒక్కటంటే ఒకే ఒక్క సినిమా. కానీ ప్రస్తుతం ఆయన తీస్తున్న రెండో సినిమాకి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడలేనంత క్రేజ్ ఏర్పడింది. దసరా సినిమాతో ఫస్ట్ టైం మెగాఫోన్ పట్టి న్యాచురల్ స్టార్ నాని కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాన్ని అందించిన ఈ యువ దర్శకుడు.. ఇప్పుడు అదే న్యాచురల్ స్టార్ నానితో దసరా కంటే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ది ప్యారడైజ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ కయాదు లోహర్ నటిస్తుండగా, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అంతకంతకూ పెంచుకుంటూపోయాయి.
తాజాగా మేకర్స్ ఈ రోజు ది ప్యారడైజ్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గతంలో హిట్ 3 లో నాని వయొలెంట్ అవతార్ చూసిన ప్రేక్షకులకు ది ప్యారడైజ్ నాని కనిపించిన తీరు చూస్తే అది ఈ సినిమా ముందు జస్ట్ ట్రైలర్ మాత్రమే అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నానితో బ్లడ్ బాత్ చేయించినట్లు టీజర్ కట్ చేశారు. ఈ చిత్రంలో వినిపించిన 3, 4 డైలాగ్స్ ఇప్పటి వరకు సినిమాపై ఉన్న హైప్ డబుల్ చేసేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే నాని – ఓదెల కాంబినేషన్లో వస్తున్న ది ప్యారడైజ్ బాక్సాఫీస్ వద్ద సంచనాలను నమోదు చేయడం పక్కా అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
తాజావార్తలు
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?